సిటిజెన్ హెల్త్ అడ్వైజరీ- హెల్త్ డిపార్ట్మెంట్
  • వడదెబ్బ ప్రమాదకరం మరియు తప్పక నిరోధించావలెను.
  • వడదెబ్బ లక్షణాలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు.
  • కారణం : వడగాలి వడదెబ్బకు దారితీయవచ్చు.

a. గుండె కొట్టకోవడం, తల్లనొప్పి

b. పల్స్ రేట్ పెరుగుదల

c. నోరు ఎండిపోవడం

d. శరీరంలో నీరు తగ్గిపోవడంపాక్షిక లేదా పూర్తి స్పృహ కోల్పోవడం

e. పాక్షికంగా లేదా పూర్తిగా స్పృహ కోల్పోవడం

  • మరింత సమాచారం కొరకు 104కి కాల్ చేయండి, అత్యవసరమైనచో 108కి కాల్ చేయండి,
చేయదగినవి మరియు చేయకూడనివి

  • చేయాల్సిన పనులు
  • చల్లని ప్రదేశాల్లో ఉండటానికి ప్రయత్నించండి
  • పగటి వేళల్లో గొడుగును ఉపయోగించండి
  • పలచని, వదులుగా ఉండే కాటన్ దుస్తుల, ప్రత్యేకించి తెల్లని దుస్తులను ధరించండి.
  • కాటన్ టోపిని లేదా తలపాగాను ధరించండి.
  • మధ్యహ్నం 12-౩ గంటల మధ్య బయట చేసే పనులు చేయకండి, ఓకే వేళ తప్పనిసరైతే, సూర్యరశ్మిలో తెలకపతి పనులు మాత్రమే చేయాలి.
  • ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజు నీటితో పాటు తగినంత నీటిని తాగండి.
  • గది ఉష్ణోగ్రతను తగ్గించేందుకు నీళ్ళు చల్లడం, కిటికీ తెరలు, ఫ్యాన్లు మరియు వెలుతురు నేరుగా పడకుండా అవసరమైన చర్యలు తీసుకోండి.
  • వడదెబ్బ లక్షణాలున్న మనిషిని చల్లని ప్రదేశానికి తరలించండి.
  • వడదెబ్బ తగిలిన మనిషిపై దుస్తులు తక్కువగా ఉండాలి.
  • వడదెబ్బ తగిలిన మనిషిని చల్లని లేదా మంచు ముక్కలను వేసి, ఆ నీటితో ముంచిన స్పాంజితో రుద్దాలి, దుస్తులు తక్కువగా ఉండాలి.
  • వడదెబ్బతో బాధపడుతున్న మనిషిని మంచు గడ్డల మధ్యన ఉంచవలెను.
  • వడదెబ్బ తగిలిన మనిషిలో ఎలాంటి మార్పు లేకపోతే. ప్రత్యేకించి శీతలీకరణ సౌకర్యంతో తక్షణమే ఆసుపత్రికి తరలించాలి.
వడ గాలులు కార్యాచరణ ప్రణాళిక
  • రోగి ప్రాథమిక అంచనా – ప్రాథమిక సర్వే (గాలి మార్గం, శ్వాస, రక్త ప్రసరణ, కదలడం, ఎక్స్ పోజర్) ఉష్ణోగ్రతతో సహా.
  • పరీక్షల్లో తేడాలున్నట్లయితే వేడి రుగ్మతను పరిగణలోకి తీసుకోండి.

    (ఎ) వయస్సు (చిన్న పిల్లలు, వృద్దులు) అధిక బరువు లేదా స్థూల కాయం వంటి పరిమితులు

    (బి) వాతావరణ వేడికి అలవాటుపడకపోవడం (ఇటివలి, వేసవి తొలినాళ్ళలో)

    (సి) తీవ్ర రుగ్మతలుంటే :సైకియాట్రిక్, కార్డియోవాస్కులార్, న్యూరోలాజిక్, హెమాటాలాజిక్, ఒబేసిటి, పల్మనరీ, రీనల్ మరియు రెస్పిరేటరీ.

    (డి) దిగువ తెలిపిన ఒకటి లేదా రెంటినీ తీసుకోండి :

    i.సూచనాత్మక మందులు

    ii.యాన్తి కోలినేర్జిక్ మందులు

    iii.బార్బిచురేట్స్

    iv.డైయూరేటిక్స్

    v.ఆల్కహాల్

    vi.బీటా బ్లాకర్స్

  • వాతావరణ వేడిలో నుండి తొలగించండి మరియు శారీరక శ్రమను ఆపండి
  • పరిసరాల శీతలీకరణ పద్దతులు పాటించండి.
  • (ఎ) ఆక్జిల్లా, గ్రోయిన్ మరియు మెడ చుట్టూరా తడి తువ్వాలు లేదా ఐస్ ప్యాక్ లు ఉంచాలి, రోగి కుదుట పడితే, చల్లని నీటితో స్నానం చేయండి.
  • (బి) చర్మం పై చల్లని నీటిని పిచికారీ చేయండి లేదా చల్లని నీటితో తుడవండి. కమిలిన చర్మం పై చల్లని గాలిని ప్రసరింపజేయడానికి ఫ్యాన్ ను వాడండి.
  • ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువుంటే, 5 నిమిషాలకొకసారి పరిశీలించండి, మెరుగుపడుతుంటే నోటి ద్వారా నీటిని తాగించండి (ద్రావకాలు, ఓఆర్ఎస్, చల్లని ద్రవాలు)
  • ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువుంటే, రీహైడ్రేషన్ ఇవ్వండి అలాగే అత్యవసర విభాగానికి తరలించండి.
జంతువుల పెంపకాల మార్గదర్శకాలుు
  • పశువులు: జంతువులూ, మేకలు, గొర్రెలు మొదలైనవి ఉదయం మరియు సాయంకాలాల్లో మాత్రమే బయటకు మేతకు తీసుకోని వెళ్ళాలి. పగటి సమయంలో కొట్టంలోనే పశువులు ఉంచవలెను.
  • కొట్టములు లేకపోయినట్లైతే, పసువులను చెట్ల కింద ఉంచవలెను.
  • నేరుగా ఎండలో ఉంచకుండా పశుగ్రాసమును నీడలోనే ఉంచవలెను.
  • వడగాలి నుండి తప్పించడానికి పశువుల కొట్టానికి దగ్గర చెట్లను నాటవలెను.
  • వాతావరణాన్ని చల్లగా ఉంచడానికి పశువుల కొట్టాలను నార సంచులతో కప్పి ఉంచవలెను.
  • పశువులకు తగినంత నీరు (60-70 లీటర్లు/రోజుకి) అందుబాటులో ఉంచవలెను.
  • జంతువులకు తాజా పచ్చని గడ్డిని ఇవ్వాలి, ధాన్యాలను కూడా ఇవ్వవచ్చు.
  • వడగాలి ప్రభావం తగ్గడానికి పశువుల కొట్టాలల్లో ఫ్యాన్లు లేదా కూలర్స్ను ఉపయోగించవలెను.
  • బలహీనత మరియు అతిసారం రాకుండా ఉండటానికి ధాన్యాలు మరియు ఉప్పు మిశ్రమాన్ని మరియు తగినంత నీటిని జంతువులకు ఇవ్వవలెను.
  • దీర్ఘ శ్వాస మరియు అధిక ఉష్ణోగ్రతలు వడగాలి బారిన జంతువుల లక్షణాలు, వద్ద దెబ్బ తగిలిన జంతువులు చల్లని నీటితో స్పాంజితో రుద్దవలెను అలాగే దగ్గరలోని పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్ళవలెను.